ప్రవర్ధనం :

దానిమ్మను కొమ్మల ద్వారా నేల అంట్లు లేదా గాలి అంట్ల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు.

మంచి దిగుబదినిచ్చే ఆరోగ్యవంతమైన చెట్టు నుంచి కొమ్మలను కత్తిరించాలి.

ఒక సంవత్సరం వయసున్న ముదురు కొమ్మలను 9-12  అంగుళాల పొడవు గల ముక్కలుగా కత్తిరించి నాటుకోవాలి.

మొక్క మొదలు నుంచి వచ్చే కొమ్మలను కత్తిరింపులు చేసి నాతుకుంటే ఎక్కవగా సఫలమువుతాయి.

ఆరు నెలల కంటే తక్కువ, 18 నెలల కంటే ఎక్కవ వయసున్న కొమ్మలను కత్తిరింపు కోసం ఎన్నికోరాదు.

వేర్లు తొడిగిన కత్తిరింపులు 9 నెలల్లో నాటుటకు అనువుగా  వుంటాయి.

వర్షాకాల ప్రారంభంలో గాలి అంట్లను ప్రవర్ధనం చేస్తే ఎక్కువ వేర్లు తొడిగే అవకాశముంటుంది.

గాలి అంట్లు 25-30 రోజులలో వేర్లు తొడిగి 3 నెలలకు నాటుటకు అనువుగా వుంటాయి.